రైతుల సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారతీయ కిసాన్ సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్ పాల్గొన్న సభలో వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటన నుంచి పలువురు కర్షక నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హర్యానాలోని జింద్‌లో బుధవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
‘ఇప్పటి వరకు ‘బిల్ వాస్సీ’ (సాగు చట్టాల రద్దు) గురించే మాట్లాడాం. ఈ అంశాన్ని ప్రభుత్వం శ్రద్ధగా వినాలి. ఒకవేళ యువత ‘గద్దీ వాప్సీ’(అధికారం నుంచి దిగిపోవడం)కి పిలుపునిస్తే మీరేం చేస్తారు?’ అని రాకేశ్ టికాయిత్ ప్రశ్నించారు.

కుప్పకూలిన వేదిక.. రైతుల సభలో అపశ్రుతి