పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన అమరీందర్ సింగ్.. శనివారం ఉదయం విషం తాగడంతో హుటాహుటీన చికిత్స కోసం సోనేపట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటలకు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. రైతు ఆత్మహత్యాయత్నం గురించి ఆయన చనిపోవడానికి గంట ముందు హరియాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
కాగా, ఇటీవల యూపీలోని రామ్‌పూర్ జిల్లాకు చెందిన కశ్మీర్ సింగ్ అనే రైతు కూడా ఘాజీపూర్ సరిహద్దు వద్ద అత్మహత్య చేసుకున్నాడు. ఇక, డిసెంబరులో పంజాబ్‌కు చెందిన అమర్జీత్ సింగ్ అనే లాయర్ టిక్రీ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతుల ఆందోళనకు మద్దతుగా తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. డిసెంబరు 20 గుల్బార్ సింగ్ అనే రైతు, 21 మరో రైతు విషం తాగి చనిపోయారు.