divyavani: YSRCPలోకి దివ్యవాణి.? ఎదగాలంటే లొంగాలి.. TDP ఇంటర్నల్ పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్ – actress and tdp spokesperson divyavani shocking comments on telugu desam party internal politics

0
15


ప్రధానాంశాలు:

  • టీడీపీ ఇంటర్నల్ పాలిటిక్స్‌పై దివ్యవాణి షాకింగ్ కామెంట్స్
  • ఏ రంగంలోనైనా అందానికి ప్రాధాన్యత అంటూ హాట్ కామెంట్స్
  • పార్టీలో ఉన్నవాళ్లే ఎదగనీయరు
  • పార్టీ మార్పుపై క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇబ్బంది లేకపోయినా పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న మాట నూటికి నూరు శాతం నిజమే అని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ హీరోయిన్ దివ్యవాణి. ఈ సందర్భంగా ఆమె అధికార వైసీపీ పార్టీలో చేరుతున్నారనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

గతంలో టీడీపీ నుంచి బీజేపీలో వరుస చేరికల సందర్భంగా దివ్యవాణి పేరు గట్టిగానే వినిపించింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటానని.. తుదిశ్వాస వరకూ నేను తెలుగుదేశం పార్టీని వీడేది లేదు’ అంటూ తెగేసి చెప్పారు దివ్యవాణి. అయితే గత రెండున్నరేళ్లుగా తాను పార్టీలో ఉంటున్నప్పటికీ సరైన గుర్తింపు లభించకపోవడానికి పార్టీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ కారణం అని సంచలన కామెంట్స్ చేశారు దివ్యవాణి.

ఎందుకు ఇబ్బంది పడుతూ టీడీపీలోనే కొనసాగుతున్నారు?? వైసీపీ, ఇతరపార్టీల నుంచి ఆఫర్లు రాలేదా? టీడీపీని వీడే ఉద్దేశంలో ఉన్నారా?? అన్న ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు సినీ నటి దివ్యవాణి. ఆమె మాట్లాడుతూ..

టైం రావాలి.. తొందర పడను
దేనికైనా సమయం రావాలి.. నా వాయిస్‌ని గట్టిగా వినిపించడానికి టీడీపీ పార్టీ తప్ప వేరే పార్టీ లేదా? అంటే.. టైం రావాలి.. కంగారు పడటం దేనికి? కొంత సమయం చూద్దాం.. తొందరపడటం నాకు ఇష్టం లేదు.

నాకు ఎలాంటి ఎఫైర్లు, రూమర్స్ లేవు.. కానీ పాలిటిక్స్‌లోకి వచ్చాక
నాకు 15 ఏళ్ల వయసు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను.. నా సినీ కెరియర్‌లో నా మీద ఎలాంటి రిమార్క్ లేదు.. ఒకరితో కలిసి పబ్‌లకు వెళ్లానని కానీ.. ఎఫైర్లు, రూమర్లు లేవు.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పరిస్థితి దారుణంగా ఉంది. నేను సమస్య గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. తప్పు ఉంటే విమర్శించవచ్చు.. కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. వాళ్ల అమాయకత్వాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను వేరే పార్టీకి వెళ్లడం పెద్ద సమస్య కాదు.

పాలిటిక్స్ నాకు సెట్ కావు అనుకున్నా.. చంద్రబాబుకి విషయాన్ని చెప్పా
చాలాసార్లు రాజకీయాలు నాకు సెట్ కావని అనిపించింది. నేను పాలిటిక్స్‌లోకి వస్తానని అనుకోలేదు.. ఇంత మంచి నాయకుడు చంద్రబాబు దగ్గర పనిచేస్తానని అనుకోలేదు. ఇంటర్నల్ పాలిటిక్స్ ఇష్యూని బాబుగారి దగ్గరకు తీసుకుని వెళ్లలేదు కానీ.. ఒక లెటర్ రాసి ఇచ్చా. పెద్దయన అంత టైం ఇవ్వలి కదా.. ఖచ్చితంగా నా వాయిస్ విప్పుతా. ఎందుకంటే బాబుగారు పాజిటివ్‌గానే స్పందిస్తారనే నమ్మకం ఉంది.

దొంగవేషాలు వేయలేదు.. కక్కుర్తి పనులు చేయను
నేను అధికారం కోసం బాబుగారి దగ్గర దొంగవేషాలు వేయలేదు. సీటు కోసం నేను ఎప్పుడూ ఆయన్ని అడగలేదు. అంతేతప్ప మీడియాని ఉపయోగించుకుని కక్కుర్తి పనులు చేయను. అవి బయటకు వస్తే చండాలంగా ఉంటుంది.

అధికార ప్రతినిధి అంటే ఏంటి?? గైడెన్స్ ఇవ్వరు.. మాట్లాడనీయరు
నాకు అధికార ప్రతినిధి అని ఇచ్చారు. అధికార ప్రతినిధి అంటే పార్టీ వాయిస్ మనం వినిపించాలి. అలా మాట్లాడటానికి ఇన్ పుట్స్ ఇవ్వాలి.. పలానా వాళ్లు ఇది మాట్లాడారు.. దానికి కౌంటర్‌గా ఇది మాట్లాడు అని చెప్పరు. గైడెన్స్ ఇచ్చే నాదుడు ఉండడు. తీరా మనం మాట్లాడిన దానికి వేరే వాళ్లు కౌంటర్ ఇచ్చి మాట్లాడితే.. తిరిగి దానిపై మాట్లాడటానికి అడిగితే.. నిన్నే కదా మీరు మాట్లాడారు అని అంతే చాలా బాధ వేస్తుంది.అనేవాడు మనల్ని అడిగి అంటాడా?? అధికార ప్రతినిధి అన్నప్పుడు గైడెన్స్ ఇవ్వాలి.

బాబుగారిని చూసి టీడీపీలో జాయిన్ అయ్యా.. మహిళలకు పెద్దపీట వట్టిదే

ఇష్యూ జరిగినప్పుడు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లాను. ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. నేను కేవలం బాబుగారిని చూసి మాత్రమే టీడీపీలో జాయిన్ అయ్యాను. మహిళలకు పెద్దపీట అనేది ఊరికే చెప్పే మాటలు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, పురుందేశ్వరి లాంటి వాళ్లకి బ్యాగ్రౌండ్ ఉంది. కానీ జయలలిత లాంటి వాళ్లు రాజకీయాల్లో రాణించడానికి చాలా కష్టపడ్డారు.

పార్టీలో ఉన్నవాళ్లే తొక్కేస్తారు..
నా అభిప్రాయం ప్రకారం పార్టీలో ఉన్నవాళ్లే మహిళల్ని ఎదగనీయరు. పార్టీలో ఒక మహిళకు టాలెంట్‌ ఉంది.. ముందుకు దూసుకుని వెళ్లగలిగే సామర్ధ్యం ఉంది అంటే.. పార్టీలో ఉన్న వాళ్లే ముందుకు వెళ్లనీయరు.

అందంపై ఆశలు.. కాంప్రమైజ్ అయితే లిఫ్ట్ చేస్తారు
ఏ రంగంలో ఉన్నా.. ఆడపిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉండవు. సినీ, రాజీకీయం, సాఫ్ట్ వేర్, జర్నలిజం ఇలా ఏ రంగం తీసుకున్నా.. ఆమె అందాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్లకి ఏవేవో ఆశలు ఉంటాయి. కాంప్రమైజ్ అయిన వాళ్లకి లైఫ్ ఒకలా ఉంటుంది. వాళ్లు ఒక్కో స్టెప్ ఎక్కే విధానం వేరేలా ఉంటుంది. ఏమీ లేకుండా నేను ముక్కుసూటిగా వెళ్తాను అనే వాళ్లకి వేరేలా ఉంటుంది. కానీ.. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. అన్నీ చూస్తుంటాడు. దేవుడు ఇచ్చే తీర్పుముందు.. ఆయన ఇచ్చే లిఫ్ట్ ముందు ఏ మనుషులూ కూడా మనల్ని అణగతొక్కలేరు. అదే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నా అంటూ సంచలన కామెంట్స్ చేశారు దివ్యవాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here