disha patani: Pushpa: సుకుమార్ ప్లాన్‌పై దెబ్బేసిన దిశా పటానీ! అమ్మడి డిమాండ్ చూస్తే.. ఇదీ మ్యాటర్ – disha patani demand for item song with allu arjun in sukumar movie pushpa

0
39


రంగస్థలం సినిమా తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న మరో ప్రయోగాత్మక సినిమా ‘పుష్ప’ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఏ చిన్న పాయింట్ కూడా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయొద్దనే కోణంలో పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోతన రెగ్యులర్ పంథాలోనే ‘పుష్ప’ కోసం సూపర్ డూపర్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసి.. హీరోయిన్ దిశా పటానిని సంప్రదించగా ఆమె సుక్కుకే చుక్కలు కనబడే రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

సుకుమార్ మూవీ అంటేనే ఐటెం సాంగ్‌తో థియేటర్లు హోరెత్తిపోవాల్సిందే. అందులో అల్లు అర్జున్- సుకుమార్ కలిస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే దిశా పటానితో ఓ రేంజ్ ఐటెం నెంబర్ ప్లాన్ చేశారట సుక్కు. అయితే ఈ సాంగ్ చేసేందుకు గాను ఏకంగా కోటిన్నర అడిగిందట దిశా పటానీ. దీంతో నాలుగు నిమిషాల పాట కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకని వేరే హీరోయిన్ వేట ప్రారంభించిన సుకుమార్.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా పేరు పరిశీలనలో పెట్టారని టాక్.
ప్రియుడితో మాల్దీవుల్లో కియారా అద్వానీ సరదా.. బ్యాక్‌లెస్ పోజుతో మత్తెక్కించిన లస్ట్ భామ
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్‌తో కనిపించనున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తుండగా ఆయన సరసన పల్లెటూరు పిల్లలా రష్మిక మందన కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆరుగురు యూనిట్ సభ్యులకు కరోనా సోకటంతో షూటింగ్ వాయిదా వేసిన సుక్కు.. అతి త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీపై అల్లు అర్జున్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here