పాటను విడుదల చేసిన సందర్బంగా నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేసి ఆరు రోజులు కష్టపడి భారీ నిర్మాణ వ్యయంతో ఈ పాటను చిత్రీకరించాం. దీంతో పాటు ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు.
నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మార్చి నెలలో లాక్‌డౌన్‌కు ముందు చేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ బాగా ఉపకరించాయి. పాట అద్భుతంగా వచ్చింది. రామ్ తన స్టెప్స్‌తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణిశర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజీఎమ్స్ అదిరిపోయాయి. థియేటర్లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది’ అని చెప్పారు.

రామ్ ‘రెడ్’: డించక్ సాంగ్ లిరికల్ వీడియో