ప్రధానాంశాలు:
- సౌత్ ఇండియన్ స్టార్స్‌ని అనుకరిస్తున్న డేవిడ్ వార్నర్
- ‘ఆచార్య’గా ఆస్ట్రేలియన్ క్రికెటర్
- కమింగ్ సూన్ అంటూ వీడియో పోస్ట్
చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ ‘ఆచార్య’ టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లోని సన్నివేశాన్ని రీఫేస్ యాప్‌తో ఛేంజ్ చేసి చిరంజీవి డైలాగ్స్‌ని తాను చెబుతున్నట్లు వీడియో తీశాడు డేవిడ్ వార్నర్. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. ఈ మేరకు ‘కమింగ్ సూన్’ అంటూ ఆయన చేసిన కామెంట్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
చిరంజీవి 152వ సినిమాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ ‘ఆచార్య’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ‘సిద్ధ’ పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు.
గత రెండు రోజుల క్రితం విడుదలైన ఆచార్య టీజర్ సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ 10 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఇకపోతే ఈ ‘ఆచార్య’ను మే 13వ తేదీన రంగంలోకి దించబోతున్నట్లు ప్రకటించారు చిత్ర దర్శకనిర్మాతలు.

చిరంజీవి ‘ఆచార్య’ టీజర్