ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తెలుగువారికి సుపరిచితుడే. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపులు మెరిపించడంతో పాటు తెలుగు సినీ పాటలకు డ్యాన్సులు వేస్తూ అలరిస్తుంటాడు. ఆయన టాప్ హీరోల పాటలు, డైలాగులకు తన మేనరిజాన్ని అప్లై చేసి ప్రేక్షకులను తరుచూ అలరిస్తుంటాడు. గతంలో మహేశ్‌బాబు పాటలకు స్పెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ న్యూ ఇయ్ వేళ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చాడు.