covid-19 guidelines: కొత్త వైరస్ పట్ల జాగ్రత్త.. కొవిడ్ ఆంక్షలు జనవరి 31 వరకు పొడిగింపు – centre extends covid-19 guidelines till jan 31, alerts on new coronavirus

0
42


రోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన మార్గదర్శకాలను కేంద్రం మరోసారి పొడిగించింది. దేశంలో కొవిడ్-19 గైడ్‌లైన్స్ జనవరి 31 వరకూ అమల్లో ఉంటాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం (డిసెంబర్ 28) స్పష్టం చేసింది. కిందటిసారి విధించిన మార్గదర్శకాలు జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కింది. ఈ మేరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా యూకేలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వైరస్‌ స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వైరస్‌ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం సూచించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఆంక్షలు అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here