corona vaccine price: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. మార్కెట్లో ఎంతకు కొనొచ్చు? – covishield to be sold in private markets at rs 1000 per vial, says serum institute of india

0
43


దేశ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యాక్సిన్ డోసులను దేశంలోని నిల్వ కేంద్రాలకు మంగళవారం (జనవరి 12) తరలించారు. తమ సంస్థ నుంచి వ్యాక్సిన్ల రవాణా చరిత్రాత్మక ఘట్టమని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ అందించడమే తమ ముందున్న ఛాలెంజ్‌ అని చెప్పారు. ఈ సందర్భంగా కీలక వివరాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు లాభాపేక్ష లేకుండా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు అదర్ పూనావాలా చెప్పారు. ఒక్కో డోసును కేవలం రూ.200లకే అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని సామాన్యులు, పేదలు, ఆరోగ్య కార్యకర్తల కోసం తక్కువ ధరకే టీకా సమకూరుస్తున్నట్టు వెల్లడించారు. తొలి దశలో 10 కోట్ల డోసులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరఫరా చేసే డోసులకు రూ.200ల కంటే ఎక్కువ ఛార్జీ చేయనున్నట్లు తెలిపారు.

ఇక మార్కెట్‌లో ప్రైవేట్‌గా ఒక్కో వ్యాక్సిన్ డోసును 1000 రూపాయలకు విక్రయిస్తామని అదర్ పూనావాలా తెలిపారు. కొవిషీల్డ్‌ టీకా కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా చాలా డిమాండ్ నెలకొందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here