comedian ali: Pawan Kalyan: పవన్‌‌ని కలిసా.. సినిమా చేస్తా, మా మధ్య విభేదాల్లేవ్, మొత్తం వాళ్లే చేశారు: కమెడియన్ అలీ యూటర్న్ – comedian ali emotional words about pawan kalyan

0
20


ప్రధానాంశాలు:

  • అలీ ఈజ్ బ్యాక్
  • మిత్రుడు పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఆయనతో కలిసి సినిమా చేస్తానంటూ ప్రకటన
  • ‘లాయర్ విశ్వనాథ్’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ

లాయర్ విశ్వనాథ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కమెడియన్ అలీ. బాల నాగేశ్వరరావు వరద దర్శకత్వం వహిస్తూ ఎం.ఎన్‌.వి సుధాకర్‌, సూర్య వంతరంలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ కూతురు జుబెరియా బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే ఈ మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అలీ.. పవన్ కళ్యాణ్‌‌తో తనకు ఉన్న ఫ్రెండ్ షిప్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘పవన్ కళ్యాణ్‌ని లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ కలవడం నిజమే.. ఎలా ఉన్నావ్ అని అడిగారు.. బాగున్నా అని చెప్పా.. మళ్లీ కలుద్దాం అని చెప్పారు.. అలాగే అని అన్నా. మాకు రాజకీయంగా కాస్త దూరం ఏర్పడింది కానీ.. వ్యక్తిగతం ఎలాంటి విభేదాలు లేవు. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ నేను కలవను అని నేను ఆయనతో ఎప్పుడూ చెప్పలేదు.. ఆయన కూడా నన్ను అన్నది ఏంలేదు. మధ్యలో లేనిపోనివి అన్నీ సృష్టించింది మీడియానే.

దాదాపు ఏడాదిన్నర తరువాత పవన్ కళ్యాణ్‌ని కలిశా. మధ్యలో కలుద్దాం అని ట్రై చేశా.. కానీ ఆయన లేరు. పూణెలో ఉన్నారని తెలిసింది. రీసెంట్‌గా ఆయన్ని పెళ్లిలో కలిశా. ఇండస్ట్రీలో ఇలాంటి మామూలే.. మేమంతా బాగానే ఉంటాం.. బయట జనాలు కావాలని రచ్చ చేస్తుంటారు తప్పితే.. మాలో ఎలాంటి విభేదాలు ఉండవు. 2021లో పవన్-అలీ కలిసి సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. డెఫనేట్‌‌గా కలిసి సినిమా చేస్తాం..

పవన్ Vs అలీ అసలు వివాదం ఇదీ..
పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయగానే.. అలీ ఆ పార్టీలో చేరతారని అందరూ భావించారు. కానీ, అలీ అందుకు విరుద్ధంగా వైసీపీలో చేరి పవన్ సహా అందరికీ షాకిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో భాగంగా అలీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని.. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. అలీ చెప్పిన వాళ్లకు జనసేన తరపున టిక్కెట్‌ ఇచ్చినా.. తనను వదిలి వెళ్లారని, మోసం చేశాడని అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని.. తనతో కలిసి పనిచేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పా పెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయారని.. వెళ్లింది కాక.. తాను ఎన్నికల్లో రాణించలేనని ఆయన ఎలా అనుకుంటారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

అయితే ఆ తరవాత అలీ కూడా కౌంటర్ ఇచ్చారు.. తాను స్వశక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాను తప్ప ఎవరో తీసుకువస్తే రాలేదని అన్నారు అలీ. పవన్ కల్యాణ్ నాకు సాయం చేశారా? ఇంట్లో ఖాళీగా వుంటే ఆయన నాకు అవకాశాలు ఇప్పించారా? డబ్బులు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే తాను మంచి పొజిషన్లో ఉన్నానని అలీ గుర్తు చేశారు. తాను వైసీపీలోకి చేరడం న్యాయం కాదని, వైసీపీలోకి తాను వెళ్లకూడదని రాజ్యాంగంలో రాసి లేదని అలీ అప్పట్లో కౌంటరిచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మొత్తం మీడియానే చేసింది మేమంతా బాగానే ఉన్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here