ఓ ఏనుగును ఇద్దరు మావటీలు విక్షణరహితంగా కర్రలతో కొట్టారు. దెబ్బలకు తాలలేక ఆ గజరాజం చేసిన అరుపులు పలువురి మనసును కలచివేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మనుషులా, పశువులా అని మావటిలపై మండిపడుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోని శ్రీవిల్లిపుత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయ్యో పాపం.. ఏనుగును దారుణంగా కొట్టిన మావటిలు
ఏనుగుపై దాడి చేసిన మావటీలను వినీల్ కుమార్, శివ ప్రసాద్‌గా గుర్తించారు. ఏనుగుపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోను తమ దృష్టికి వచ్చిందని హెచ్‌ఆర్‌అండ్‌ఈసీ (హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్) అధికారులు తెలిపారు. సదరు మావటీల చర్యలు తీసుకుంటామని చెప్పారు.