Chitram Sequel: Teja: 21 ఏళ్ల తర్వాత ‘చిత్రం’ సీక్వెల్.. అదే టెక్నికల్ టీమ్.. 45 కొత్త మొహాలు – teja announces sequel to his maiden hit chitram

0
24


ప్రధానాంశాలు:

  • ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా వచ్చిన ‘చిత్రం’
  • తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తేజ
  • మళ్లీ అదే టెక్నికల్ టీమ్‌తో సీక్వెల్ తీస్తోన్న తేజ

‘చిత్రం’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. 21 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలైన ‘చిత్రం’ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో పరిచయమైన డైరెక్టర్ తేజ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. అలాగే, కొత్తవాళ్లయిన హీరోహీరోయిన్లు ఉదయ్ కిరణ్, రీమా సేన్ కూడా తొలి సినిమాతోనే పాపులర్ అయ్యారు.

వీళ్లే కాదు ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ కూడా పరిచయమయ్యారు. ఆయన కూడా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ చిన్న ‘చిత్రం’ బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో రూ.50 లక్షలు కూడా ఉండదని సమాచారం.

పెళ్లయ్యాక నితిన్ స్పీడు పెంచాడు.. మాకు చెక్ పెట్టాడు: వరుణ్ తేజ్
కాలేజ్ క్యాంపస్ కథలకు రూట్ మ్యాప్ అయిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 22న) డైరెక్టర్ తేజ ఈ సినిమాను ప్రకటించారు. ‘చిత్రం 1.1’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం నటీనటులందరినీ కొత్తవాళ్లను తీసుకున్నారని సమాచారం. మొత్తం 45 మంది కొత్త నటీనటులను తేజ ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారట. అయితే, కేవల నటీనటులు మాత్రమే కొత్తవాళ్లు.. టెక్నికల్ టీమ్ మాత్రం ఇంచుమించుగా పాతదే.

Chitram Sequel

‘చిత్రం 1.1’ టైటిల్ పోస్టర్

‘చిత్రం’ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మళ్లీ చాలా కాలం తరవాత తేజతో జతకట్టారు. కాకపోతే, ‘చిత్రం’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి పనిచేయడం లేదు. ఆయన స్థానంలో సమీర్ రెడ్డిని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. అలాగే, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. అలాగే, ‘చిత్రం’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన శంకర్ కూడా ‘చిత్రం 1.1’కు వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద 21 ఏళ్ల తరవాత మళ్లీ తన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు తేజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here