chiranjeevi: రాక్‌స్టార్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ మెగాస్టార్ లెటర్.. దేవీ శ్రీ ప్రసాద్‌కి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ – chiranjeevi given special gift to devi sri prasad

0
23


ప్రధానాంశాలు:

  • ‘ఉప్పెన’ విజయంలో కీలకపాత్ర పోషించిన మ్యూజిక్
  • దేవీ శ్రీ ప్రసాద్‌కి చిరంజీవి లెటర్
  • వీడియో ద్వారా ఆ లెటర్ చదివి వినిపించిన రాక్‌స్టార్

రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ స్పెషల్ గిఫ్ట్ పంపించారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఉప్పెన’ సినిమాకు సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చినందుకు గాను దేవీ శ్రీని ప్రశంసిస్తూ ఓ లెటర్ రాసి గిఫ్ట్‌తో పాటు పంపించారు. తనకెంతో ఇష్టమైన చిరంజీవి పంపిన ఈ గిఫ్ట్ చూసి మురిసిపోయిన దేవీ శ్రీ ప్రసాద్.. ఓ వీడియో ద్వారా ఆయన పంపిన లెటర్ చదివి వినిపిస్తూ ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేశారు.

”డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ `ఉప్పెన` విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో.. చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కి కూడా అంతే ఫ్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమతో చిరంజీవి” అంటూ చిరు ఆ లేఖలో పేర్కొన్నారు. మెగాస్టార్ పంపిన ఈ లెటర్, మెగా బహుమతి పట్ల దేవీ శ్రీ ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘లవ్ యూ చిరు సార్’ అని పేర్కొన్నారు దేవీ శ్రీ ప్రసాద్.
నీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌కి దండం దొర.. హాట్ టాపిక్‌గా మారిన ప్రభాస్ లేటెస్ట్ లుక్స్
‘ఉప్పెన’తో యూత్ ఆడియన్స్ మనసు దోచేశారు వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి. చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ, డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఇక ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను పీక్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ తొలి సినిమానే ఆయనకు భారీ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్న ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here