ప్రధానాంశాలు:
- తూర్పు లడఖ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన.
- మరోసారి అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన పొరుగుదేశం చైనా.
- ఎల్ఏసీ వివాదంలో భారత్‌పైనే వేలెత్తిన చూపిస్తోన్న డ్రాగన్
‘చైనాతో మన సరిహద్దులు ఎప్పుడూ గుర్తించలేదు. చైనా ఎల్ఏసీపై నా అవగాహన ప్రకారం కాలక్రమేణా, అతిక్రమణలు జరిగాయి.. మన అవగాహన ప్రకారం మనం ఎన్నిసార్లు అతిక్రమించామో మీలో ఎవరికీ తెలియదు. మేము దానిని ప్రకటించం.. చైనా మీడియా దానిని కవర్ చేయదు.. చైనా 10 సార్లు అతిక్రమించినట్లయితే, మన అవగాహన ప్రకారం మేము కనీసం 50 సార్లు చేసి ఉండాలి’ అని విమర్శించారు.
ఈ విమర్శలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. భారత్ తెలియకుండానే సరిహద్దు ఉద్రిక్తతల్లో తన ప్రమేయాన్ని అంగీకరించింది. చైనా భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం తరచూ దురాక్రమణలకు పాల్పడుతోంది.. నిరంతరం వివాదాలు, ఘర్షణలను సృష్టించింది.. ఇది చైనా-ఇండియా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు మూల కారణం’ అని నోరుపారేసుకున్నారు.
చైనాతో కుదిరిన ఏకాభిప్రాయం, ఒప్పందాలు, ఒప్పందాలను అనుసరించాలి.. సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని దృఢమైన చర్యలతో సమర్థించాలని మేము భారతదేశాన్ని కోరుతున్నాం’ అని వాంగ్ అన్నారు. గతేడాది మే నుంచి తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్-చైనాలు చర్చలు జరిగినప్పటికీ..ఆశించిన ఫలితం దక్కలేదు.