నవీన్ ఇదివరకే వేరే యువతితో ప్రేమలో ఉండగా.. ఆ రోజు రాత్రి ఫోన్ చేసిన ప్రియురాలు అతడిని బెదిరించింది. ఈ పెళ్లి చేసుకుంటే మండపానికి వచ్చి అతిథుల ముందు విషం తాగుతానని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన నవీన్ తుముకూరులో ఉన్న ప్రియురాలిని కలవడానికి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు.
ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే నవీన్ సోదరుడు అశోక్ వివాహం జరిగింది. కానీ, నవీన్ కనిపించకుండా పోవడంతో సింధు వివాహం ఆగిపోయింది. దీంతో ఆమె కుటుంబం తీవ్రంగా కలతచెందింది. సింధు కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేక అదే మండపంలో పెళ్లి జరిపించాలనే నిర్ణయానికి తల్లిదండ్రులు వచ్చారు. ఈ వేడుకకు హాజరైన ఓ యువకుడు తాను సింధును వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాడు. దీంతో బీఎంటీసీలో కండక్టర్గా పనిచేసే చంద్రుతో సింధుకు అదే మండపంలో పెళ్లి జరిపించారు.
ఇరు కుటుంబాలకు ఇష్టమైతే సింధును పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో కథ సుఖాంతమయ్యింది. ఇరు కుటుంబాలు చర్చల అనంతరం సింధు, చంద్రు వివాహానికి అంగీకరించడంతో అతిథిగా వచ్చిన వ్యక్తి వరుడయ్యాడు. సింధు మెడలో తాళికట్టి ఆమెను తనదానిని చేసుకున్నాడు.