Check Movie Pre Release Business: ‘చెక్’ ప్రీ రిలీజ్ బిజినెస్: నితిన్ సినిమాకు మంచి ధర.. నిర్మాత సేఫ్! – nithiin check has reportedly fetched rs 27 crore through pre release business

0
26


ప్రధానాంశాలు:

  • చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ‘చెక్’
  • ఖైదీగా నటించిన హీరో నితిన్
  • లాయర్‌గా కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘చెక్’. వైవిధ్యమైన సినిమాలను రూపొందించే క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలవుతోంది. ఇప్పటికే విడులైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే, మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించే మెటీరియల్ ఈ సినిమాలో ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే, గ్రామీణ ప్రేక్షకుల కంటే పట్టణ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దేశద్రోహం, ఉగ్రవాదం కేసులో అరెస్టయిన ఒక చెస్ ఛాంపియన్.. జైలులో ఉంటేనే తనను ఎలా నిరూపించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి రూపొందించారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బి, సి ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ అంచనాలను దాటేసింది. ‘చెక్’ సినిమా థియేట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడుపోయాయి.

వైష్ణవ్ తేజ్‌ను ఎమర్జింగ్ స్టార్ అన్న హరీష్ శంకర్.. నెటిజన్ పంచ్ పేలింది!
థియేటర్లలో 100 శాతం సీటింగ్‌ కెపాసిటీకి ప్రభుత్వాలు అనుమతినివ్వడం, టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి సమ్మతించడంతో డిస్ట్రిబ్యూటర్లకు కూడా ధైర్యం వచ్చింది. అందుకే, మంచి సినిమాల థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకోవడానికి డబ్బులు వెదజల్లుతున్నారు. కొత్త హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా రూ.20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు అంచనా. అలాగే, ఇప్పుడు ‘చెక్’ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడుపోయాయట.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు ‘చెక్’ సినిమాకు రూ.15 కోట్లు వెచ్చించారని సమాచారం. నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను రూ.5 కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఈ రూ.15 కోట్లతో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ.12 కోట్లు వసూలైందట. కాబట్టి, ఈ సినిమా నిర్మాతకు సేఫ్ వెంచర్ కాబోతోంది. ఇక సినిమాను విడుదల చేస్తోన్న డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటో ఈనెల 26 తరవాత తెలుస్తుంది.

రష్మిక మందన టాప్ టక్కర్ సాంగ్.. కొత్త అవతారం, క్రేజీ స్టెప్పులతో ఫిదా చేసిన కన్నడ భామ
భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రశేఖర్ యేలేటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here