Bosnia: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. విషవాయువు పీల్చి 8 మంది మృతి – carbon monoxide poisoning during new year eve celebrations killed 8 in bosnia cottage

0
31


నూతన సంవత్సర వేడుకలు బోస్నియాలోని ఓ గ్రామస్థులకు తీవ్ర విషాదాన్ని నింపాయి. విషవాయువు పీల్చి 8 మంది దుర్మరణం పాలయ్యారు. బోస్నియా నైరుతి ప్రాంతంలో ట్రిబిటోవో గ్రామంలో గురువారం (డిసెంబర్ 31) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బోస్నియా రాజధాని సారాజేవోకు నైరుతి దిశగా 90 కిలోమీటర్ల దూరంలోని ట్రిబిటోవో గ్రామంలో ఓ హాలిడే కాటేజీలో కొంత మంది యువతీ యువకులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెచ్చదనం కోసం యువకులు పవర్‌ జనరేటర్‌ స్విచ్ఛాన్ చేశారు. ఆ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీకైంది. లీకైన విష వాయువు కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చి కొంత మంది యువకులు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలారు. మిగిలిన వారంతా భయంతో అక్కడ నుంచి పరుగెత్తారు.

ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని.. వీరిలో అమ్మాయిలు కూడా ఉన్నారని బోస్నియా మీడియా తెలిపింది. జనవరి 1న ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోసుజ్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరగింది. దీంతో యువకుల మృతికి సంతాప సూచకంగా ఆ మున్సిపాలిటీలోని దుకాణాలు, కాఫీ షాపులు, రెస్టారెంట్ల యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

కార్బన్‌ మోనాక్సైడ్‌ రంగు, రుచి, వాసన లేని వాయువు. ఈ వాయువును పీల్చిన వారు వెంటనే అనారోగ్యానికి గురై మృతి చెందే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here