పట్నా సమీపంలోని అల్వాల్పూర్ గ్రామానికి చెందిన అతుల్ సింగ్ (28) విచారణలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. నిరుద్యోగ యువత ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 30 నుంచి 40 మంది ద్వారా కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అతుల్ సహచరులు ఇంద్రజిత్ సింగ్, సంజీవ్ కుమార్‌లను అరెస్ట్ చేయడంతో అతడి భాగోతం బయటపడింది. నోయిడాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నట్టు ఐడీ కార్డ్ చూపించి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. అయితే, పోలీసులు తగిన రుజువులు చూపడంతో మద్యం విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నాడు.
రైడింగ్ సమయంలో రూ.1.75 లక్షల నగదు కూడా లభించింది. గత మూడు నెలలుగా అతుల్ ఈ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతుల్‌కు మద్యం సరఫరా చేసే వైశాలికి చెందిన నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అతుల్ ఇంట్లో బ్లాక్ డాగ్, ఆఫీసర్ ఛాయిస్, మెక్డాల్, 100 పైపర్స్, బ్లెండర్స్ ప్రైడ్, కింగ్ ఫిషర్, ఓల్డ్ మంక్, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ మద్యం లభించింది.