ప్రధానాంశాలు:
- ప్రస్తుతం బోయపాటితో BB3 సినిమా చేస్తున్న బాలయ్య
- గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ
- ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్
ఇదిలా ఉంటే, ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందట. ఈ సినిమా ఓకే అయిపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుందని కూడా అంటున్నారు.
గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మాస్ మహారాజా రవితేజతో హ్యాట్రిక్ కొట్టారు. మరి ఇప్పుడు బాలయ్య కోసం ఆయన ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేశారో చూడాలి. ఏదేమైనా గోపీచంద్ మలినేని లాంటి మాస్ డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. బోయపాటి, గోపీచంద్ మలినేని లాంటి దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేయడం వల్ల మళ్లీ ఆయనకు పూర్వ వైభవం రావడం ఖాయం.