balakot airstrikes: బాలాకోట్‌పై భారత్ దాడి‌లో 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.. పాక్ మాజీ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు – former pakistan diplomat admits 300 casualties in balakot airstrike by india

0
14


పుల్వామా ఆత్మహుతి దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమైనా పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అక్కడ ఉగ్రవాద శిబిరమే లేదని, ఒక్కరు కూడా చనిపోలేదని పాక్ బుకాయించింది. తాజాగా, ఈ ఘటనపై పాక్ మాజీ దౌత్యాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ తరఫున తరుచూ టీవీ చర్చల్లో పాల్గొనే ఆయన ఓ ఉర్దూ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత జరిపిన ఎయిర్ స్ట్రయిక్స్‌లో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు పేర్కొన్నారు.

‘భారత్ అంతర్జాతీయ సరిహద్దును దాటి యుద్ధ చర్య చేసింది.. ఇందులో కనీసం 300 మంది మరణించినట్లు తెలిసింది. మా లక్ష్యం వారి కంటే భిన్నంగా ఉంది. మేము వారి హైకమాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం ఎందుకంటే వారు సైనికులు.. సర్జికల్ స్ట్రయిక్స్ పరిమిత చర్య- ఎటువంటి ప్రాణనష్టం జరగలేని మేము అచేతనంగా అంగీకరించాం.. ఇప్పుడు మేము చెబుతున్నాం.. వారు ఏమి చేసినా, మేము చాలా తక్కువగానే స్పందిస్తాం.. ఉధృతం చేయం’ అని పాక్ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ వ్యాఖ్యానించారు.

పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమూద్ ప్రకటించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా ఉగ్రదాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన భారత్.. పఖ్తునఖ్వా ప్రావిన్సుల్లోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది.

పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ నేత అయాజ్ సిద్ధీఖీ గతేడాది అక్టోబరులో ఇటువంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ నిరాకరించారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా గదిలోకి వచ్చారు. అప్పటికే ఆయన కాళ్లు వణుకుతున్నాయి. చెమటలు పట్టాయి.

భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయనట్లయితే, రాత్రి 9 గంటల ప్రాంతంలో పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఖురేషి చెప్పారు. అభినందన్‌ను విడుదల చేయడం ఒక్కటే మార్గమని, పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ తదితర పార్టీలను అభ్యర్థించారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనం ప్రచురించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here