ప్రధానాంశాలు:
- ఆస్ట్రాజెనెకా టీకాను తాత్కాలికంగా నిలిపేసిన దక్షిణాఫ్రికా.
- వ్యాక్సిన్‌పై బ్రిటన్ ఆరోగ్య మంత్రి వాఖ్యలపై చర్చ.
- కరోనా మరణాల సంఖ్యలో ఐదో స్థానంలో బ్రిటన్.
‘కరోనా వైరస్‌తో ఆసుపత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యం, మరణాలను నివారించడంలో టీకా ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.. చివరికి ఈ టీకాలను మేము ప్రస్తుతం కోరుకుంటున్నాం’ అని బ్రిటన్ మంత్రి ఎడ్వర్డ్ అర్గార్ వ్యాఖ్యానించారు. ‘బ్రిటన్‌లో వ్యాప్తిచెందుతున్న స్ట్రెయిన్లలో దక్షిణాఫ్రికా జాతి తక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి.. బ్రిటన్ స్ట్రెయిన్లు చారిత్రాత్మకమైనవి.. కెంట్ వేరియంట్‌పై ఈ టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది’ అని అన్నారు.
జనాభాలో ప్రతి ఒక్కరికి టీకాలు వేసే విషయంలో ఇజ్రాయెల్ ప్రస్తుతం మిగతా దేశాల కంటే చాలా ముందుంది.. తర్వాతి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, బహ్రెయిన్, అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ ఉన్నాయి. ఇక, ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల సంభవించిన దేశాల జాబితాలో బ్రిటన్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 12 మిలియన్ల మందికిపైగా టీకా తొలి డోస్ వేశారు. అలాగే, వీరిలో దాదాపు ఐదు లక్షల మంది రెండో డోస్ తీసుకున్నారు.
వైరస్ జన్యు పరివర్తన చెందడం, కొత్త వైవిధ్యాలుగా పరిణామం చెందుతున్నందున వేలాది వ్యక్తిగత మార్పులు తలెత్తినప్పటికీ ఒక చిన్న అంశం మాత్రమే వైరస్‌ను రీతిని మార్చగలదని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల ప్రకారం కరోనా వైరస్ రకాల్లో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిలియన్ స్ట్రెయిన్లు ఇతరవాటి కంటే ఎక్కువ వ్యాప్తిని కలిగిస్తాయి.