Arun Alexander: ‘ఖైదీ’ నటుడు హఠాన్మరణం – kaithi actor and dubbing artist arun alexander passes away due to cardiac arrest

0
130


చిత్ర సీమలో 2020 సంవత్సరం తీవ్ర విషాదాన్ని నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ కారణంగా మనం చాలా మంది సినీ ప్రముఖులను కోల్పోయాం. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా మహమ్మారికి బలైపోయారు. కేవలం కరోనా వైరస్ వల్లే కాకుండా కొంత మంది నటుల హఠాన్మరణాలు కూడా సినీ ప్రియులను షాక్‌కు గురిచేశాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటులంతా ఈ ఏడాదే కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌లోనూ చాలా మంది ప్రముఖ నటుల్ని మనం కోల్పోయాం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదలుకొని ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, నిషికాంత్ కామత్, సరోజ్ ఖాన్, జగదీప్, రాక్‌లైన్ సుధాకర్, వడివేల్ బాలాజీ, జయప్రకాష్ రెడ్డి, చిరంజీవి సర్జా, సేతురామన్ ఇంకా చాలా మంది సినీ ప్రముఖులను ఈ ఏడాది తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు మరో ప్రముఖ తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ హఠాన్మరణం చెందారు.

ఆగిన రాజశేఖర్ కుమార్తె సినిమా.. అడివి శేష్‌కు కోర్టు నోటీసులు
‘ఖైదీ’ సినిమాలో మాదక ద్రవ్యాల ముఠాకు సహకరించే పోలీస్ అధికారిగా నటించిన అరుణ్ అలెగ్జాండర్ సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తమిళ ప్రేక్షకులకు సుపరిచితం. ‘మనరం’, ‘కోలమావు కోకిలా’, ‘ఖైదీ’, ‘బిగిల్’ సినిమాల్లో నటనకు గాను అరుణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ఆయన నటించారు. అరుణ్ మరణవార్త తెలిసి తమిళ సినీ ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అరుణ్‌కి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here