ప్రధానాంశాలు:
- యాంకర్ రవి హీరోగా `తోటబావి`
- యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా
- రిలీజ్ డేట్ ఫిక్స్
గతంలో ‘ఇది మా ప్రేమకథ’ సినిమాతో హీరోగా వెండితెరపై కాలుమోపిన రవి.. ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన మళ్ళీ ‘తోటబావి’ అంటూ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై ఆలూర్ ప్రకాష్ గౌడ్ , దౌలు (విష్ణుప్రియ హోటల్) చిన్న స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభినేష్. బి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంజి దేవండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమి హీరోయిన్గా నటిస్తోంది. శివశంకర్ మాస్టర్, ఛత్రపతి శేఖర్, నర్సింహా రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, రోహిణి, ఉన్నికృష్ణ, అభి, శివం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిలీప్ బండారి బాణీలు కడుతున్నారు.
ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యిందని, తాము అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చిందని డైరెక్టర్ అంజి దేవండ్ల అన్నారు. ముందునుంచి రవిగారు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనని ఆయన తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో థ్రిల్ చేయడానికి ఈ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు ఆలూర్ ప్రకాష్ గౌడ్ , దౌలు చిన్న స్వామి, అభినేష్. బి మాట్లాడుతూ ఈ సినిమా ఆద్యంతం అలరిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
యాంకర్ రవి ‘తోటబావి’ టీజర్