ప్రధానాంశాలు:
- కార్తికేయ హీరోగా ‘చావు కబురు చల్లగా’
- దర్శకుడిగా పరిచయం అవుతోన్న కౌశిక్ పెగళ్లపాటి
- ప్రత్యేక ఆకర్షణగా అనసూయ ఐటమ్ సాంగ్
ఈ సినిమాలో అనసూయ మంచి మాస్ మసాలా ఐటమ్ సాంగ్‌లో చిందేశారని మేకర్స్ వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్‌తో సాగే ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ‘చావు కబురు చల్లగా’ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తోంది.
కాగా, అనసూయకు స్వాగతం చెబుతూ చిత్ర హీరో కార్తికేయ ట్వీట్ చేశారు. ‘‘అనసూయ గారికి స్వాగతం. మీ ప్రెజెన్స్‌తో మా సినిమాను మరింత ప్రత్యేకంగా చేసిన మీకు చాలా కృతజ్ఞతలు. మంచి పండుగ లాంటి ఈ స్పెషల్ సాంగ్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’’ అని కార్తికేయ ట్వీట్లో పేర్కొన్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్, టీజర్, మైనేమ్ ఈజ్ రాజు పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది.