ప్రధానాంశాలు:
- బన్నీకి తృటిలో తప్పిన ప్రమాదం
- ఖమ్మంలో రోడ్డు ప్రమాదం
- కారవాన్ ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
శనివారం నాడు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ‘పుష్ప’ చిత్రం షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ కారవాన్ పై AA (అల్లు అర్జున్) పేరుతో కూడిన సింబల్ ఉండడంతో హీరో కారవాన్లో ఉన్నారనుకుని స్థానికులు భారీగా గుమిగూడారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా.. అల్లు అర్జున్-సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగష్టు 13న ‘పుష్ప’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా నటించింది.

అల్లు అర్జున్ లగ్జరీ కారవాన్