అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటించబోతున్నారని టాక్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ నిజం ఏంటో తెలీదు. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ ద్వారా సయీ మంజ్రేకర్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత మహేష్ మంజ్రేకర్ కుమార్తె. మహేష్ మంజ్రేకర్ ‘ఒక్కడున్నాడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘అదుర్స్’, ‘డాన్ శీను’, ‘అఖిల్’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించారు. ముఖ్యంగా ‘ఒక్కడున్నాడు’, ‘అదుర్స్’ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

మహేష్ మంజ్రేకర్, సయీ మంజ్రేకర్
కాగా, సయీ మంజ్రేకర్ ఇప్పటికే ఒక టాలీవుడ్ మూవీని అంగీకరించారు. ‘మేజర్’ సినిమాలో అడివి శేష్ సరసన ఆమె నటిస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఆమె హీరోయిన్గా నటించడం నిజమే అయితే ఇది ఆమె రెండో తెలుగు సినిమా అవుతుంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలే ఉన్నాయి. వాటిలో మొదటిగా పూర్తయ్యే చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్. ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ చిత్రం చేయనున్నారు బన్నీ. అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయనున్నారు.