ఐపీసీ సెక్షన్లు 494 (భర్త లేదా భార్య జీవితకాలంలో మళ్లీ వివాహం), 495 (మునుపటి వివాహం చేసిన వ్యక్తిని మభ్యపెట్టడం) నేరం అని న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న జస్టిస్ సూర్యప్రకాశ్ కేశర్వానీ, జస్టిస్ డాక్టర్ యోగేందర్ కుమార్ శ్రీవాస్తవల ధర్మాసనం.. అటువంటి జంటకు న్యాయస్థానం నుంచి రక్షణ పొందడానికి అర్హత లేదని వ్యాఖ్యానించింది.
‘అలాంటి సంబంధం ‘లైవ్-ఇన్ రిలేషన్’ లేదా ‘వివాహ సంబంధం’ అనే పద బంధంలోకి రాదు … భార్యాభర్తలుగా జీవించేటప్పుడు ఇతరులు జోక్యం చేసుకోకుండా రక్షణ కోసం రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. వారు అభ్యర్థించినట్టు రక్షణ కల్పిస్తే అది ఐపీసీ 494/495 సెక్షన్ల కింద నేరాలకు వ్యతిరేకంగా రక్షణను కల్పించినట్టవుతుంది’ అని పేర్కొంది.
కోర్టు ప్రకారం.. మాండమస్ రిట్ (ఆర్డర్ రూపంలో న్యాయ పరిహారం) చట్టానికి విరుద్ధంగా జారీ చేయడం లేదా శిక్షాస్మృతితో సహా చట్టబద్ధమైన నిబంధనను ఉల్లంఘించలేం..పిటిషనర్లకు మాండమస్ రిట్ కింద అడగడానికి చట్టబద్ధంగా, న్యాయపరంగా రక్షణ పొందే హక్కు లేదు’ అని కోర్టు తీర్పు ఇచ్చింది.