Alitho Saradaga: ఎం.ఎస్.నారాయణ భార్యకు సర్జరీ.. కామెడీ సీన్ చేసి బాత్‌రూంలోకి వెళ్లి ఏడ్చేవారు: హేమ – actress hema shares emotional situation about comedian ms narayana in alitho saradaga show

0
28


ప్రధానాంశాలు:

  • ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో శ్రీలక్ష్మితో కలిసి పాల్గొన్న హేమ
  • తన తమ్ముళ్ల మరణాల గురించి చెప్పిన శ్రీలక్ష్మి
  • అదే సమయంలో ఎం.ఎస్.నారాయణ ప్రస్తావన తీసుకొచ్చిన హేమ

కెమెరా ముందు నవ్వుతూ నటించే నటీనటుల వెనుక తీరని బాధ కూడా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చావుబతుకుల్లో ఉన్నా, ఒకవేళ మరణించినా ఆ బాధను దిగమింగుకొని నటించాల్సిన పరిస్థితి. ముందుగా కాల్షీట్లు ఇచ్చేస్తారు కాబట్టి తమ వల్ల షూటింగ్ మొత్తం క్యాన్సిల్ కాకూడదని ఆలోచించి చాలా మంది నటీనటులు బాధను దిగమింగుకొని షూటింగ్‌లో పాల్గొంటారు. సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తారు. అలాంటి రెండు సంఘటనలు తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి.

హాస్యనటుడు ఆలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ తాజా ఎపిసోడ్‌లో సీనియర్ నటి శ్రీలక్ష్మి, నటి హేమ పాల్గొన్నారు. శ్రీలక్ష్మి తన తమ్ముళ్లు రాజేష్, ఆనంద్ మరణించిన సందర్భాలను ఈ షోలో ప్రస్తావించారు. రాజేష్ (హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తండ్రి) మరణించినప్పుడు శ్రీలక్ష్మి హైదరాబాద్‌లో ‘పెళ్లి సందడి’ షూటింగ్‌లో ఉన్నారట. అర్ధరాత్రి చెన్నై నుంచి ఫోన్ వచ్చిందట తమ్ముడు చనిపోయాడని. తాను వెంటనే వెళ్లాలని శ్రీలక్ష్మి మేనేజర్‌కు చెప్పారట. కానీ, మేనజరేమో రేపు చాలా ముఖ్యమైన సన్నివేశం చిత్రీకరణ ఉందని.. వెళ్లిపోతే ఎలా అని అన్నారట. కానీ, శ్రీలక్ష్మి ఏడుస్తూనే తాను వెళ్లాలని కచ్చితంగా చెప్పారట.

అర్ధనగ్నంగా పాప్ సింగర్.. మెడలో గణేషుడి బొమ్మ.. రాహుల్ గాంధీని లాగిన బీజేపీ లీడర్
ఆ రాత్రి వేళ రాఘవేంద్రరావుకు మేనేజర్ ఫోన్ చేయడంతో వెంటనే శ్రీలక్ష్మిని విమానంలో చెన్నైకి పంపాలని చెప్పారట. చెన్నైలో విమానం దిగిన తరవాత ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు శ్రీ ఆమెను కారులో ఇంటికి తీసుకెళ్లారట. ఇక మరో తమ్ముడు ఆనంద్ చనిపోయినప్పుడు తాను తమిళ సీరియల్ షూటింగ్‌లో ఉన్నానని శ్రీలక్ష్మి చెప్పారు. అయితే, అప్పుడు ఆ సీరియల్ డైరెక్టర్ తనను వెంటనే పంపలేదని ఆమె వెల్లడించారు. ఆ దర్శకుడు చేసిన ఆలస్యం వల్ల తాను ఇంటికి వెళ్లే సరికే ఆనంద్ చనిపోయాడని ఏడుస్తూ చెప్పారు శ్రీలక్ష్మి.

Hema Sri Lakshmi

హేమ, శ్రీలక్ష్మి

‘‘రాత్రి 9 గంటలకు నా కాల్షీట్ అయిపోతుంది. 8.30కు నాకు ఫోన్ వచ్చింది. ఆనంద్‌కు చాలా సీరియస్‌గా ఉంది వెంటనే రావాలని ఫోన్‌లో చెప్పారు. నేను వెంటనే వెళ్లాలని డైరెక్టర్‌కు చెప్పాను. ఆయనేమో రెండే రెండు సీన్లు ఉన్నాయమ్మా చేసి వెళ్లిపోదురు అని అన్నాడు. నేనేం చేయలేని పరిస్థితి. నేను అత్త పాత్ర చేస్తున్నాను. నవ్వుతూ జాలీగా నటించాలి. లోపల బాధ దిగమింగుకొని నవ్వుతూ నటించాను. ఆ రెండు సీన్లు అయిపోయాక.. రెండే రెండు క్లోజప్ షాట్స్ తీసుకుంటానండి ఆ తరవాత వెళ్లిపోదురు అన్నాడు. మొత్తానికి రాత్రి 10 గంటలకు నన్ను వదిలాడు. ఆ టైమ్‌లో నేనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటాను వెళ్లాను. ఇంటికి వెళ్లే సరికి ఆనంద్ చనిపోయాడు’’ అని ఏడుస్తూ చెప్పారు శ్రీలక్ష్మి.

వాళ్లిద్దరూ గిఫ్టెడ్ యాక్టర్స్.. కలిసొస్తున్నారు: నాని
అదే సమయంలో ఎం.ఎస్.నారాయణ జీవితంలో జరిగిన సంఘటనను కూడా ప్రస్తావించారు నటి హేమ. ‘‘నాకు ఎం.ఎస్.నారాయణ అన్నయ్య ఒకసారి చెప్పారు. ‘దూకుడు’లో కళ్ల కింద క్యారీ బ్యాగ్ సీన్ చేస్తున్నారట. బ్రహ్మానందం అన్నయ్య, నారాయణ అన్నయ్య కాంబినేషన్ సీన్. ఆ సమయంలో ఎం.ఎస్.నారాయణ భార్యకు అపోలో హాస్పిటల్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలట. ఆయన సంతకం పెడితే కానీ సర్జరీ చేయరు. ఆయనేమో రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు. హాస్పిటల్‌కు వెళ్లడం కుదరకపోతే ఆ లెటర్‌ను ఇక్కడికి తెప్పించుకుని సంతకం చేశారట. నవ్వుతూ కామెడీ సీన్ చేసిన ఆయన సీన్ అయిన వెంటనే బాత్‌రూంలోకి వెళ్లి బాగా ఏడ్చేవారట. మళ్లీ నీళ్లతో కళ్లు కడుక్కొని వెళ్లి నటించారట’’ అని హేమ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here