ప్రధానాంశాలు:
- నాగార్జున కొత్త సినిమా స్టార్ట్
- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్
- క్లాప్ కొట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నేడు (మంగళవారం) ఉదయం ఈ చిత్రాన్ని సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్ననే ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన తనకు.. గణపతి దేవాలయంలో ఈ సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపిస్తోందని నాగార్జున తెలిపారు.
నాగార్జునను సరికొత్త యాంగిల్లో చూపించేందుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. హైదరాబాద్‌తోపాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపి సూపర్బ్ అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారట. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.