Akkineni Akhil: Akhil 5: ముంబై మోడల్‌తో అక్కినేని అఖిల్ రొమాన్స్! – mumbai model sakshi vaidhya will act in akhil 5 movie

0
54


అక్కినేని నట వారసుడు అఖిల్ సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ పూర్తి కావొస్తోంది. దీంతో తన ఐదో సినిమాపై ఫోకస్ పెట్టాడు. ‘అఖిల్ 5’ అనే టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడు.

Also Read: ఐటెమ్ గర్ల్‌గా మారిన మోనాల్.. 3 నిమిషాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముంబయికి చెందిన అమ్మాయిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్య. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫోటో షూట్ చేయడంతో పాటు.. టెస్ట్ షూటింగ్‏లో కూడా పాల్గొందంట ఈ బ్యూటీ. అఖిల్ పక్కన సాక్షి వైద్య పర్‌ఫెక్ట్‌గా సూటవుతుందని సురేందర్‌ ఫిక్స్ అయ్యారట. స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తోందట. ఇందులో అఖిల్ స్పైగా కనిపించనున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here