Ahmedabad woman suicide: మత్తు ఇచ్చి భర్త అసహజ శృంగారం.. భరించలేక భార్య..! విషాదం – woman kills self after doctor husband sedates her and forces her to have unnatural sex in ahmedabad

0
23


డక గదిలో భర్త చేష్టలకు విసిగిపోయి ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ అయిన తన భర్త తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అసహజ రీతిలో శృంగారం చేస్తున్నాడని 39 ఏళ్ల ఆ మహిళ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. భర్త వేధింపులు భరించలేకే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భర్త, అత్తింటి వారు తనను వేధింపులకు గురి చేసిన తీరును వివరిస్తూ 18 పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టింది. విషం తీసుకొని తనువు చాలించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన డాక్టర్ హితేంద్ర పటేల్, హర్ష అనే మహిళను గతేడాది (2020) ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ అది రెండో పెళ్లి. మొదటి పాట్నర్లతో విడిపోయిన వారిద్దరూ మ్యాట్రీమోని వెబ్‌సైట్లో అభిరుచులు కలవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైన తర్వాత హితేంద్ర పటేల్ నిజస్వరూపం బయటపడిందని హర్ష తన సూసైడ్ లేఖలో పేర్కొంది. కట్నం కోసమే హితేంద్ర తనను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అదనపు కట్నం కోసం అత్తామామలు మాటలతో హింసించేవారని ఆరోపించింది. అత్తామామలు పెడుతున్న ఇబ్బందుల గురించి భర్తకు చెబితే పట్టించుకోకపోగా.. తనను కొట్టేవాడని, చిత్రహింసలకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న, చిన్న కారణాలకే తనను చాలా ఇబ్బందులకు గురిచేసేవారని తెలిపింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. పడక గదిలో తన భర్త పెట్టిన చిత్రహింసలు మరో ఎత్తని బాధితురాలు పేర్కొంది. అది భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘హితేంద్ర వైద్యుడు. నాకు తరచూ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే నేను సగం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేదాన్ని. ఆ తర్వాత అతడు చాలా బలవంతంగా అసహజ రీతిలో శృంగారం చేసేవాడు’ అని సూసైడ్ లేఖలో ఆమె రాసుకొచ్చింది.

హితేంద్ర తన కుమార్తెను పెళ్లి చేసుకొని వదిలేశాడని హర్ష తండ్రి నాన్జీ పటేల్ తెలిపారు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోందని.. గత మంగళవారమే (ఫిబ్రవరి 9) తన భర్త వద్దకు వెళ్లిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందనే విషాద వార్త తెలిసిందని అన్నారు. నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని కోరారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు హితేంద్ర, అతడి తల్లిదండ్రులు, సోదరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here