actor deep sidhu: ఎర్రకోట హింస: ఆ నటుడి ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు.. ఢిల్లీ పోలీసుల ప్రకటన – delhi police one lakh reward announced for leads on actor deep sidhu for r-day violence

0
21


ప్రధానాంశాలు:

  • రిపబ్లిక్ డే హింసలో నటుడు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.
  • పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ చెబితే రివార్డు.
  • పంజాబీ నటుడు దీప్ సిద్ధూ పాత్రపై అనుమానాలు.

గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిర్దేశించిన మార్గంలో కాకుండా చారిత్రక ఎర్రకోటను రైతులు ముట్టడించారు. అయితే, దీని వెనక ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్దు హస్తమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నటుడు దీప్ సిద్ధూ మరో ముగ్గురు నిందితుల గురించి ఆచూకీ చెప్పిన వారికి ఢిల్లీ పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు.

నటుడు దీప్ సిద్ధూ ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష, మిగతా ముగ్గురి నిందితులకు చెరో రూ.50,000 రివార్డు ఇవ్వనున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, ఎర్రకోట హింస ఘటనలో మరో నలుగురు నిందితులు జగ్‌బీర్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్, బూటా సింగ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, జనవరి 26 ముందు రోజు రాత్రి దీప్ సిద్ధూ రొచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని రైతులు ఆరోపించారు.

మరోవైపు, రైతులు చేస్తున్న ఆరోపణలను దీప్ సిద్ధూ కొట్టిపారేశారు. అంతేకాదు, తాను వారి గురించి నోరు విప్పితే తలలు ఎక్కడ పెట్టుకుంటారో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిగ్గులేకుండా నాపై మీరు నింద మోపారు.. మీ నిర్ణయంతోనే ట్రాక్టర్ ర్యాలీకి జనం తరలివచ్చారు. వాళ్లంతా మీ మాటలనే అనుసరించారు. లక్షలాది మంది నా నియంత్రణలో ఎలా ఉంటారు? అంతమందిని నేనే రెచ్చగొట్టి ఉంటే మీరంతా ఎక్కడ ఉంటారు? అసలు దీప్ సిద్ధూకు అనుచరులే లేరు, ఉద్యమంలో అతడి పాత్ర ఏమీ లేదని మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు లక్షలాది మందిని నేనెలా తీసుకురాగలను?’అని దీప్ సిద్ధూ మండిపడ్డారు.

ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోగా.. రైతులు, పోలీసులు పలువురు గాయపడ్డారు. చరిత్రాత్మక ఎర్రకోటను రైతులు ముట్టడించి, త్రివర్ణ పతాకం, రైతు జెండాలను ఎగురవేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here