ప్రధానాంశాలు:
- మంచిర్యాలలో స్వల్ప అస్వస్థతకు గురైన ఆమని
- క్షణాల్లో వైరల్ అయిన వార్త
- గుండెపోటుగా చిత్రీకరించిన కొన్ని వెబ్సైట్లు
అయితే, ఈ వార్తలపై నటి ఆమని స్పందించారు. ఇలాంటి వదంతులు ఎందుకు పుడతాయో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిక్షేపంగా ఉన్నానని.. దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాలో మాట్లాడారు. ‘‘నేను నిక్షేపంగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లాను. దీన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించడం చాలా బాధాకరం’’ అని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ చిత్రంలో ఆమని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే ఆమె మంచిర్యాల వెళ్లారు. మరోవైపు, ఆమని ముఖ్యపాత్ర పోషించిన ‘అమ్మ దీవెన’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘చావు కబురు చల్లగా’తో పాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.