ప్రధానాంశాలు:
- నెట్టింట హీటు పుట్టిస్తున్న అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్
- బికినీ ఫొటోస్ షేర్ చేయడంతో మొదలైన రచ్చ
- ఉహించని విధంగా చేదు అనుభవం
ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆలియా కశ్యప్.. తన సోషల్ మీడియా ఖాతాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు చేస్తుంటుంది. నేటితరం మోడల్స్ కంటే కూడా గ్లామరస్ ఫొటోలతో ఆన్లైన్ వేదికలపై హీటు పుట్టించడం ఆమె హాబీ. అయితే రీసెంట్గా తాను షేర్ చేసిన ఫొటోలపై ట్రోలింగ్ జరిగిందని, కొందరైతే నీచమైన పదాలతో కామెంట్ చేసి బాధపెట్టారని ఆలియా చెప్పింది. ఇటీవలే ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ట్రోలింగ్‌పై ఆవేదనను వెళ్లగక్కింది.
బికినీ ఫొటోలు షేర్ చేసినందుకు గాను అసహ్యమైన కామెంట్స్ చేశారని, తనను వేశ్యతో పోల్చుతూ ‘ఒక్క రాత్రికి నీ రేటెంత?’ అని అడుగుతున్నారని ఆలియా చెప్పింది. కొందరైతే ఏకంగా రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు ఆమె పేర్కొంది. కేవలం ఇండియన్ కావడం వల్ల అల్లాంటి పోస్ట్‌లు చేయడం పట్ల సిగ్గుపడాలని తనకు చెప్తున్నారని చెప్పింది. అయితే ఈ ఇన్సిడెంట్‌తో తనలో తాను చాలా కృంగిపోయానని పేర్కొన్న ఆలియా.. తాను ఎంత సెన్సిటివ్ అనే విషయం అర్థమైందని తెలిపింది.
అప్పటినుంచి తన సోషల్ మీడియాలో ఏదైనా నెగెటివ్ కామెంట్ కనిపిస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేస్తున్నానని ఆలియా పేర్కొంది. ఇక తన సినీ ఎంట్రీ గురించి కూడా స్పందించిన ఆమె, తాను సినిమాల్లోకి రావాలని అనుకోవడం లేదని ఓపెన్‌గా చెప్పేసింది.