40GB మొబైల్‌లో 20GB సెక్స్, పోర్న్ వీడియోలే.. వాళ్లు అన్నీ చూసేశారు: డైరెక్టర్ రవిబాబు పచ్చిగా – director ravi babu about crush telugu adult movie

0
32


ప్రధానాంశాలు:

  • డైరెక్టర్ రవిబాబు లేటెస్ట్ ఇంటర్వ్యూ
  • విలక్షణ నటుడిగా గుర్తింపు
  • దర్శకుడిగా అనేక హిట్ చిత్రాలు
  • అడల్ట్ కంటెంట్ చిత్రాలతో పాపులర్

రవిబాబు విలక్షణ నటుడే కాదు.. విలక్షణ దర్శకుడు అనడానికి అల్లరి, అబ్బాయిలు అబ్బాయిలు, అనసూయ, నచ్చావులే, అవును, లడ్డూబాబు, అదుగో, ఆవిరి.. రీసెంట్‌గా క్రష్ చిత్రాలే నిదర్శనం. రొటీన్ రోత సినిమాలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను తీయడానికి ఇష్టపడే రవిబాబు చిత్రాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘క్రష్’ సినిమాలో ఈ అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందని.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఇది పెద్ద వాళ్లకు మాత్రమే అని హింట్ ఇచ్చిన రవిబాబు… టీజర్‌లో కూడా బూతు కంటెంట్‌ను దట్టించారు.

అయితే ఇలాంటి బూతు చిత్రాలు ఏంటి?? రవిబాబు ఎందుకు ఇలా తీస్తున్నారనే విమర్శలు వస్తుండటంతో వాటిపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు రవిబాబు.

నేనేదో కొత్తగా అడల్ట్.. సెక్స్, పోర్న్ చూపించాలని అనుకోవడం లేదు.. ప్రతి ఒక్కడి చేతిలో మొబైల్ ఉంది.. 40GB స్టోరేజ్ ఉంటే.. అందులో 20 GB పోర్న్ వీడియోలు ఉంటాయి. ఇలాంటి వాళ్లకి మనం కొత్తగా చూపించాల్సింది ఏం లేదు.. వాళ్లు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా చూడాల్సినవి అన్నీ చూసేశారు.. వాళ్లకి కొత్తగా బిగ్ స్క్రీన్‌పై నేనేం చూపించాల్సిన పనిలేదు. నేను కేవలం ఒక స్టోరీని మాత్రమే చూపించాలని అనుకుంటున్నా.. నేను సెక్స్, పోర్న్ చూపించాలని అనుకోవడం లేదు.

క్రష్ అనే సినిమాలో నేను ముగ్గురు కుర్రాళ్లకు సంబంధించిన పర్సనల్ ఎక్స్ పీరియన్స్‌ని చూపించాలని అనుకున్నా. ఆ సినిమా ట్రైలర్… సినిమా ఎలా ఉంటుందో చెప్తుందో.. మంచి సాఫ్ట్‌ రొమాన్స్ ఉన్న సీన్లను ట్రైలర్‌లో చూపించి.. తీరా థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఇదేంట్రా బాబూ ఇలాంటి సినిమా అని ప్రేక్షకుడు అనుకోకూడదు. నాకు అది నచ్చదు. మనం ఏం సినిమా తీశాం అన్నదానిపై చూసేవాళ్లకి ఒక అవగాహన కల్పించాలి.

నేను అమ్మాయిలు అబ్బాయిలు’ సినిమా తీసినప్పుడు.. అరవైఏళ్లు దాటిన ఓ జంట థియేటర్‌కి వచ్చి.. కాసేపు సినిమా అయిన తరువాత లేచి వెళ్లిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ.. ఆ భర్త భార్యను తిడుతున్నాడు. ఏం సినిమాలో తెలుసుకోకుండా వచ్చేయడమేనా?? కనుక్కోవాలి కదా అని. అంటే ఆ సినిమా ట్రైలర్ సాఫ్ట్‌గా ఉండటంతో యూత్ సినిమా అనుకున్నారు కానీ.. బోల్డ్ అనుకోలేదు. అందుకే లేచి వెళ్లిపోయారు. అలాంటి రాంగ్ ప్రమోషన్ చేయాలని అనుకోలేదు.

అందుకే నా సినిమా ఎలా ఉంటుందని టీజర్, ట్రైలర్‌లోనే చూపిస్తున్నా.. క్రష్ కూడా అంతే. నేను ప్రౌడ్‌గా చెప్తున్నా.. అనసూయ తీసింది నేనే.. అవును తీసింది నేనే.. అల్లరి తీసింది నేనే.. క్రష్ తీసింది నేనే.. నాకు అన్ని రకాల సినిమాలు తీయడం ఇష్టం. అందులో తప్పేం ఉంది. చాలా రకాలు ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ఒకసారి చేసింది మళ్లీ చేయాలంటే నాకు బోర్ కొడుతుంది. అందుకే పంది పిల్లలతో సినిమాలు లాంటి ప్రయోగాలు. కొత్త స్టఫ్ లేకపోతే జనాలు కూడా చూడరు.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో సినిమా తీయాలని ఉంది. సినిమాలపై ప్రేక్షకులకు పూర్తి అవగాహన ఉంటుంది.. ఏం తెలియకుండా థియేటర్స్‌కి వచ్చి ఏది చూపిస్తే అది చూసి వెళ్లిపోయే రోజులు లేవు.. ప్రతిదాంట్లో కొత్తదనం కోరుకుంటున్నారు.. నా ప్రయత్నం కొత్తదనం కోసమే’ అంటూ వివరణ ఇచ్చారు రవిబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here