123 జంటలకు వివాహం.. చీర సారే సహా 73 వస్తువులు అందించిన ప్రభుత్వం

0
22తమిళనాడు అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి అధికార అన్నాడీఎంకే పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత 73 జయంతి సందర్భంగా సామూహిక వివాహాలు జరిపించే కార్యక్రమాన్ని చేపట్టింది. జయలలిత 73 వ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15న 73 మంది పేద జంటలకు వివాహాలు జరిపించాలని సీఎం ఎడిప్పాడి పళనిస్వామి తొలుత నిర్ణయించారు. అయితే, ఈ వివాహానికి 123 జంటలు తమ పేర్లను నమోదుచేసుకున్నారు.

కోయంబత్తూర్‌లో సోమవారం 123 జంటలకు జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు పాల్గొన్నారు. కోయంబత్తూరులోని కోవై శిరువాణి రోడ్డు సమీపంలో ఉన్న పేరూర్‌శెట్టిపాళయంలో వివాహాల కోసం భారీ పందిరి వేశారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య జరిగిన ఈ సామూహిక వివాహ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొని తాళిని అందజేశారు.

అంతేకాదు, వధూవరులకు మంచం, దుప్పట్లు, దిండ్లు, బీరువా, సూట్‌కేస్‌, గ్యాస్‌ స్టవ్‌, ఫ్యాన్‌, కుక్కర్‌ సహా పలురకాల వంటపాత్రలు, పూజా సామగ్రి తదితర 73 రకాల వస్తువులు అందజేయనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వధూవరుల బంధువులు, స్నేహితులకు విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, ఏటా అమ్మ జయంతి రోజున పేద జంటలకు సామూహిక వివాహాలను అన్నాడీఎంకే కోయంబత్తూరు జిల్లా నేతలు నిర్వహిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here