హీరోగా మారుతున్న జానీ మాస్టర్.. పవన్‌తో ప్రాజెక్ట్ సంగతేంటో!

0
31టాలీవుడ్‌లో కొరియాగ్రాఫర్‌గా కొనసాగుతున్న హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌‌ కోసం ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేశానని, ఎప్పటికైనా ఆయన్ని డైరెక్ట్ చేస్తానని గతంలో జానీ మాస్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రామ్‌చరణ్ నిర్మాతగా, పవన్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారని, మరోవైపు బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్‌ని డైరెక్ట్ చేయనున్నారని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ ఇప్పుడు ఆయనే హీరోగా మారుతుండటం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read:

సుజీ విజువల్స్‌ బ్యానర్‌పై కె.వెంకట్‌ రమణ నిర్మాతగా మురళీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటించనున్నారు. ఈరోజు (డిసెంబర్ 28) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను యూనిట్ నేడు ప్రకటించనుంది. ఇప్పటివరకు కొరియాగ్రాఫర్‌గా హీరోలతో స్టెప్పులు వేయించిన జానీ మాస్టర్ హీరోగా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here