సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోస్టార్ సందీప్ నహర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. పూర్తికాని అంత్యక్రియలు!

0
19విలక్షణ నటుడు, ఎం.ఎస్. ధోనీ సినిమాలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కో-స్టార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సినీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ఫిబ్రవరి 16వ తేదీన తన నివాసంలోని సీలింగ్‌కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు సందీప్. కేవలం 33 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య పాల్పడటంతో బాలీవుడ్‌లో మరోసారి అలజడి రేగింది. అయితే సందీప్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సందీప్ భార్య కంచన్, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా సందీప్ తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోను సూసైడ్ నోటుగా పరిగణిస్తున్నారు. తన మరణం ఎప్పుడో ఖాయమైందని, కానీ పరిస్థితులు మెరుగుపడుతాయని కాస్త ఆలస్యం చేశానని పేర్కొంటూనే తన చావుకు ఎవరూ కారణం కాదని ఈ వీడియోలో చెప్పారు సందీప్. పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఇందులో ప్రస్తావించారు. తన మరణం తర్వాత తన భార్య కంచన్‌ను ఏమీ అనకూడదు అని కూడా వెల్లడించారు.

దీంతో ఈ వీడియోను కీలకంగా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరణానికి ముందు ఆయనను హింసించి ఉంటారని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడమో లేక చేయడమో జరిగి ఉండవచ్చంటూ సందీప్ భార్య కంచన్, ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ కంప్లైంట్ చేశారు సందీప్ కుటుంబ సభ్యులు. ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దాని ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

మరోవైపు సందీప్ మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందలేదని, ఆ కారణంగా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందిన వెంటనే హర్యానాలోని తన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరిస్థితుల నడుమ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here