సాయి తేజ్‌కు మేలో పెళ్లి.. అమ్మాయిని ఓకే చేసిన చిరంజీవి చెల్లెలు!!

0
17నిహారిక కొణిదెల పెళ్లి తరవాత అందరి కళ్లు మెగా ఫ్యామిలీలోని ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌పై పడ్డాయి. ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు లాక్‌డౌన్ సమయంలో సింపుల్‌గా పెళ్లిల్లు చేసేసుకున్నారు. ఇప్పుడు సుప్రీం హీరో పెళ్లి కబురు ఎప్పుడు చెబుతాడా అని ఆయన అభిమానులతో పాటు చాలా మంది వేచి చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ పెళ్లికి సిద్ధంగా ఉన్నది కూడా ఆయనే.

ఆ మధ్య ప్రభాస్‌కు సారీ చెబుతూ తాను బ్యాచ్‌లర్స్ గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు సాయి తేజ్. అయితే, అది ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రచారంలో భాగమని తరవాత రివీల్ చేశారు. అప్పుడది చిత్ర ప్రచారం కోసమే అయినా ఇప్పుడు అది నిజం కాబోతుందట. సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న రూమర్.

ఈ ఇన్‌సైడ్ రిపోర్ట్స్ కనుక నిజమే అయితే.. ఈ ఏడాది మే నెలలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుంది. సాయి తేజ్ తల్లి, మెగా స్టార్ చిరంజీవి చెల్లెలు ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసేశారట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అంటున్నారు. అంతేకాదు, మెగా ఫ్యామిలీకి తెలిసిన అమ్మాయేనట. సినిమా పరిశ్రమకు ఈమెకు సంబంధం లేదంటున్నారు. మరి ఇవన్నీ నిజమా కాదా తెలియాలంటే మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన కెరీర్‌ను స్ట్రాంగ్‌గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిపైనే ఆయన ఫోకస్ పెట్టారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’తో హిట్ అందుకున్న సాయి తేజ్ ప్రస్తుతం దేవ్ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here