తెలుగులో ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేసింది రకుల్. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించింది. అదేవిధంగా నితిన్ హీరోగా రూపొందుతున్న ‘చెక్’ సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ పట్టేసి షూటింగ్లో పాల్గొంటోంది. ఇకపోతే తమిళ్లో ఇండియన్ 2లో కాజల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రకుల్.. ఇటీవలే శివకార్తీకేయన్‌తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇలా సౌత్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ దక్కించుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఈ అమ్మడికి హీరోగా రాబోతున్న ‘’ అనే కొత్త సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మెడికల్ కాలేజీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో డాక్టర్ ఫాతిమాగా రకుల్ నటించనుందని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.
ఇప్పటికే బాలీవుడ్లో ”థ్యాంక్‌గాడ్, సర్దార్ అండ్ గ్రాండ్సన్, మేడే, ఎటాక్” సినిమాలకు కమిటై బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ‘డాక్టర్ జీ’ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఏదేమైనా కోటిన్నర మేర రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కూడా రకుల్‌కి వరుస ఆఫర్స్ దక్కుతున్నాయంటే ఈ ఏడాది అమ్మడి హవా ఓ రేంజ్లో ఉంటుందని అర్థమవుతోంది కదూ!.