సంక్రాంతికి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న పవర్‌స్టార్, రెబల్ స్టార్!

0
26సంక్రాంతి పండక్కి తమ హీరోల సినిమాలు చూడలేకపోతున్నామన్న ఆవేదనలో ఉన్న అభిమానులకు , సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా?. అభిమానుల దాహం తీర్చేందుకు టీజర్లతో రానున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. హిందీ మూవీ ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’తో పవన్ నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేది.

Also Read:

అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదలను వేసవికి వాయిదా వేశారు. దీంతో పండగ పూట అభిమానులను నిరాశ పరచకుండా టీజర్‌ను విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’ నంచి కూడా ఓ సర్‌ప్రైజ్ రానుందట. సంక్రాంతి రోజు టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఖుషీ చేయాలని యూనిట్ భావిస్తోందట. దీంతో సంక్రాంతికి పెద్ద సినిమాలు లేవని బాధపడే ప్రేక్షకులకు ఈ రెండు భారీ సినిమాల టీజర్లు కాస్త ఊరటనివ్వనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here