శ్మశానంలో కుప్పకూలిన పైకప్పు.. ఐదుగురు మృతి, శిథిలాల్లో 15 మంది

0
35ఢిల్లీ శివారులోని ఆదివారం ప్రమాదం సంభవించింది. యూపీలోని ఘజియాబాద్‌ జిల్లాలో ఓ భవనం కుప్పకూలి ఐదుగురు మృతిచెందారు. మురాద్‌నగర్ శ్మశానవాటిక భవనం కాంప్లెక్స్‌లోని ఓ భవనం పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరి కొందరు చిక్కకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

సహాయక చర్యలను చేపట్టిన పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరో 15 మంది వరకు శిథిలాల కింద ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసేందుకు జేసీబీ సాయంతో భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. అతడి బంధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో భారీ వర్షం కురువడంతో అందరూ భవనం కిందకు చేరారు. ఇంతలో దానిపైకప్పు కూలిపోయింది.

ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. అంతేకాదు, దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ‘సహాయక చర్యలను వేగంగా చేపట్టి, సంఘటనపై నివేదికను సమర్పించాలని నేను జిల్లా అధికారులను ఆదేశించాను. ఈ సంఘటనలో బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here