‘శకుంతల’గా సమంత.. తొలిసారి పౌరాణిక పాత్రలో

0
29సంచలన దర్శకుడు గుణశేఖర్‌ ప్రస్తుతం ‘’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం బిజీగా ఉన్నాడు. ప్రణయ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం ఆయన వేట కొనసాగిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారు? దుష్యంత మహారాజుగా ఎవరు కనిపిస్తారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే శకుంతల పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందని, దీని కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందని వార్తలొచ్చాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శకుంతల పాత్రలో అక్కినేని నటించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం రానప్పటికీ… యూనిట్ సమంతను సంప్రదించిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను జనవరిలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read:

విదేశీ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది ‘శాకుంతలం’. 1889లో ఈ నాటకం నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషలలోకి అనువాదం అయింది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో డీలా పడిన గుణశేఖర్ ఈ సినిమాతో తానేంటో ఇండస్ట్రీకి మరోసారి నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here