వెంకటేష్‌కి ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్.. మరోసారి కడుపుబ్బా నవ్వించనున్న గోపరాజు రమణ!!

0
26ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో కొండలరావు పాత్ర గుర్తుందా. ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోయే, చిరాకుగా ఉండే తండ్రి పాత్ర అది. ఆ పాత్రలో అద్భుతంగా నటించి సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచారు నటుడు గోపరాజు రమణ. ఈ సినిమాతో గోపరాజు రమణకు కచ్చితంగా అవకాశాలు పెరుగుతాయని అంతా ఊహించారు. ఇప్పుడు అది నిజమైంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

గోపరాజు రమణకు విక్టరీ తండ్రిగా నటించే అవకాశం వచ్చిందని సమాచారం. అది కూడా ‘’ లాంటి నవ్వులు పంచే సినిమాలో అని అంటున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్3’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

కాగా, ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రిగా గోపరాజు రమణ నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆయన పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉందంటున్నారు. అనిల్ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు. మరి అలాంటి దర్శకుడికి గోపరాజు రమణ లాంటి నటుడు దొరికితే ఇక నవ్వుల జాతరే. కడుపు చెక్కలైపోవడం ఖాయం. ఫన్, ఫ్రస్ట్రేషన్ కలగలిపిన ఇలాంటి సినిమాలో ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా!

ఇదిలా ఉంటే, 2019 సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ F2కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here