విడుదలకు ముందే వకీల్ సాబ్ హంగామా.. పవర్ స్టార్ సినిమాకు మరో భారీ ఆఫర్!

0
28పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ని తిరిగి వెండితెరపై చూడబోతున్నామనే శుభవార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. ఈ పరిస్థితుల నడుమ ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైందని తెలుస్తుండగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం పోటీ ఎక్కువైందనేది ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం.

మొదట వకీల్ సాబ్ సినిమా శాటిలైట్ హక్కుల కోసం 15 కోట్లకు పైగానే ఆఫర్ చేసిన ఓ ప్రముఖ ఛానల్ అనూహ్యంగా తప్పుకోవడంతో.. ఆ స్థానంలో జీ తెలుగు ఎంటరైందని, 15 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాపై జనాల్లో ఉన్న ఆతృతను పెంచేస్తూ సంక్రాంతి కానుకగా నిన్న (జనవరి 14) వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో చూపించిన హీరో ఎలివేషన్స్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఈ `వకీల్‌ సాబ్` సినిమాను ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించగా.. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here