వరుస సినిమాలతో కీరవాణి తనయుడి దూకుడు.. ‘భాగ్ సాలే’!

0
22



కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి ‘భాగ్ సాలే’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం శ్రీ సింహా పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘మత్తు వదలరా’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాల తర్వాత శ్రీ సింహా నటిస్తున్న మూడో చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ గతంలో ‘పెళ్ళి చూపులు’, ‘ఏబీసీడీ’, ‘దొరసాని’ చిత్రాలను ప్రేక్షకులకు అందించాయి. తమ కొత్త ప్రాజెక్ట్‌తో మరో విజయాన్ని అందకుంటామనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతగా మధుర శ్రీధర్‌రెడ్డి టాలీవుడ్‌‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ఆయన ‘స్నేహగీతం’, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్’, ‘లేడీస్ అండ్ జెంటిల్‌మన్’, ‘ఏబీసీడీ’ లాంటి న్యూ ఏజ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

కాగా, క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ‘భాగ్ సాలే’ టైటిల్ సాలిడ్‌గా ఉంది. శ్రీ సింహా లుక్, క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌లో శ్రీ సింహా షేడ్ ఫొటో, టైటిల్ పక్కన పరుగులు పెడుతున్న ఇద్దరు వ్యక్తుల ఫొటోలు ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్‌తో మరో న్యూ కాన్సెప్ట్ మూవీ టాలీవుడ్‌లో చూడొచ్చని అర్థమవుతోంది. మార్చి మూడో వారం నుంచి ‘భాగ్ సాలే’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సుందర్ రామ్ సినిమాటోగ్రఫీ, సత్య గిడుటూరి ఎడిటింగ్ అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here