‘వకీల్ సాబ్’ టీజర్ రెడీ.. ఆ రోజు రిలీజ్‌కు సన్నాహాలు.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

0
36పవర్‌స్టార్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావాలని యూనిట్ ముందుగా అనుకున్నప్పటికీ అనుకోని అవాంతరాల కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ రేసులోకి మారిపోయింది. అయితే ‘వకీల్ సాబ్’ నుంచి కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు ఫీలవుతున్నారు.

Also Read:

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘వకీల్ సాబ్’ టీజర్ సిద్ధమందని, జనవరి 1న రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందంటూ ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై యూనిట్ నుంచి అధికారిక సమాచారం వస్తే గాని ఇది నిజమా.. రూమరా? అన్న దానిపై క్లారిటీ రాదు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 2020లో ట్విట్టర్‌లో ‘వకీల్ సాబ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిన దాని బట్టి ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి లీకులు నిర్మాతలను భయపెడుతున్నాయి. ఇటీవలే పవన్‌ లుక్‌కు సంబంధించి, పవన్-శ్రుతిహాసన్ మధ్య సాంగ్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్లో ప్రత్యక్షం కావడంతో యూనిట్ షాకైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here