వందేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన ఎనిమిదో ఏడాదిగా 2020.. ఐఎండీ నివేదిక – 2020 was among warmest years in india since 1901 says imd report

0
21


గడిచిన 120 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరాల్లో ఒకటిగా 2020 నిలిచింది. అయితే, 2016లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతల కంటే తక్కువ అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. గత రెండు దశాబ్దాలలో 2001-2010, 2011-2020 రికార్డుస్థాయిలో 0.23 డిగ్రీలు, 0.34 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు సూచించింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 నుంచి 2020 వరకు 15 ఏళ్లు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ఇందులో పన్నెండు 2006- 2020 మధ్య ఉన్నాయి.

1901-2020 మధ్య కాలంలో దేశ సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.62 డిగ్రీల మేర పెరుగుతున్న ధోరణికి నిదర్శనం. ‘1981-2010 మధ్య నమోదయిన ఉష్ణోగ్రత వివరాల ఆధారంగా 2020లో దేశవ్యాప్తంగా సగటు ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.29 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ నమోదయ్యింది.. ఇది దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయిన ఎనిమిదో సంవత్సరంగా నిలిచింది’ అని ఐఎండీ పేర్కొంది. ఏదిఏమైనప్పటికి 2016లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత (0.71 డిగ్రీలు) కంటే అత్యల్పం అని తెలిపింది.

ప్రధానంగా రుతుపవనాలు, నైరుతి తరువాత వరుసగా 0.43 డిగ్రీలు, 0.53 డిగ్రీల నమోదు ఈ ఉష్ణోగ్రతకు దోహదపడ్డాయి. ఈ వ్యతాసం కారణంగా శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత సాధారణణంగా 0.14 డిగ్రీల ఎక్కువగా ఉందని ఐఎండీ నివేదిక తెలిపింది. యాదృచ్ఛికంగా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు అక్టోబర్-డిసెంబర్ కాలంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అయితే, రుతుపవనాల కంటే ముందు ఉష్ణోగ్రతలు మైనస్ 0.03‌ డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం.. గతేడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతల్లో 1.2 డిగ్రీల సెల్సియస్ మేర వ్యత్యాసం ఉంది. మార్చి, జూన్ తప్ప దేశంలో నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. సెప్టెంబరు (0.72 డిగ్రీలు- ఈ నెలలో 1901 నుంచి ఇదే అత్యధిక ఉష్ణోగ్రత) ఆగస్టు (0.58 డిగ్రీలు-రెండో అత్యధికం), అక్టోబరు (0.94 డిగ్రీలు-మూడో అత్యధికం), జులై (0.56 డిగ్రీలు- ఐదో అత్యధికం), డిసెంబరు (0.39 డిగ్రీలు-ఏడో అత్యధికం).

ఇక, 2016 (0.71 డిగ్రీలు), 2009 (0.55 డిగ్రీలు), 2017 (0.541 డిగ్రీలు), 2010 (0.539 డిగ్రీలు), 2015 (0.42 డిగ్రీలు)లో సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, 2020లో వర్షపాతం 109 శాతం మేర కురిసింది. ఇది సాధారణ సగటు వర్షపాతం కంటే ఎక్కువే. అలాగే, నైరుతి ముంద తప్పా గతేడాది దేశ సగటు ఉష్ణోగ్రతలు అన్ని కాలాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here