‘లవ్ స్టోరీ’ కోసం వెనక్కి వెళ్తోన్న ‘టక్ జగదీష్’.. నాని త్యాగం చేశారట!!

0
19నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పుడే చర్చ మొదలైంది. దీనికి కారణం అదే రోజు నేచురల్ స్టార్ సినిమా ‘టక్ జగదీష్’ విడుదలకానుండటం. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’ను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు గతంలో ప్రకటించారు. ఆ తరవాత కొన్ని రోజులకు ‘లవ్ స్టోరీ’ సినిమాను కూడా ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

అయితే, ఈ రెండూ పెద్ద సినిమాలు కావడంతో బాక్సాఫీసు వద్ద గట్టిపోటీ ఖాయం అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కొంత మంది అయితే రెండింటిలో ఏదో ఒక సినిమా విడుదల తేదీ మారచ్చు అని అన్నారు. ఇప్పుడు అదే నిజమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇరు చిత్రాల నిర్మాతలు తాజాగా చర్చించుకున్నారట. ‘టక్ జగదీష్’ నిర్మాతలు తాము ఒక వారం వెనక్కి వెళ్లడానికి అంగీకరించారని సమాచారం. అంటే, ‘టక్ జగదీష్’ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ‘టక్ జగదీష్’లో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మరోవైపు, ‘లవ్ స్టోరీ’ సైతం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here