రోడ్లను దున్ని సాగు చేస్తాం.. అక్టోబర్ 2 వరకు డెడ్‌లైన్: టికాయత్

0
27ర్రకోట ఘటన అనంతరం కాస్త తీవ్రత తగ్గినట్లే కనిపించిన మళ్లీ పుంజుకుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఆందోళన ఇప్పట్లో ముగిసేది కాదని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ (రహదారుల దిగ్బంధనం) కార్యక్రమం నిర్వహించారు. దీనికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభించింది.

ఢిల్లీ- ఉత్తర్ ప్రదేశ్‌ రహదారి ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర్ ప్రదేశ్‌లో దురాక్రమణదారులు తమ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని చూశారని ఆరోపించారు.

‘ఈ రహదారుల దిగ్బంధం ఈరోజుతో ముగిసేది కాదు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది. అప్పటివరకు రోడ్లపైనే వ్యవసాయం చేస్తాం. రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తాం’ అని అన్నారు. అక్టోబర్ 2 లోగా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డెడ్‌లైన్ విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here